Site icon Prime9

MInister Vidadala Rajini: త్వరలో మంగళగిరి ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు

Arogyashri-services

Arogyashri-services

Mangalagiri: త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని తెలిపారు. సోమవారం మంత్రి విడదల రజని మంగళగిరిలోని ఎయిమ్స్ ను పరిశీలించారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించిన మంత్రి ప్రజలకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లను అడిగి సమస్యలేమిటో తెలుసుకున్న మంత్రి రజని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్బంగా మంత్రి రజని మాట్లాడుతూ మెంటల్ హెల్త్, యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందున్నారు. ఎయిమ్స్ కు జగనన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉందని తెలిపారు.అన్ని పూర్తవగానే ఎయిమ్స్ లోనూ వైద్యసేవలు పేదలకు అందుబాటులో వుంటాయన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ కు చేసిందేమీలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ముఖ్యమంత్రి జగన్ మౌళిక సదుపాయాల కోసం రూ.55కోట్లు ఖర్చు చేసారన్నారు. ఎయిమ్స్ లో మంచినీరు శాశ్వత పరిష్కారానికి ఈ రోజు నుంచే పనులు మొదలయ్యాయని అన్నారు. రూ.7.74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి ఎయిమ్స్ కు పైపు లైన్ పనులు ప్రారంభించామన్నారు.

Exit mobile version