Site icon Prime9

CM Jagan: రేపటి నుండి కొత్త సంక్షేమ పధకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

AP Government to launch new welfare schemes

AP Government to launch new welfare schemes

Amaravati: ఓ వైపు ఆర్ధిక భారం. మరో వైపు ఉన్న పధకాల్లో లొసుగులు. నెల పుడితే కొత్త అప్పులకు ఎదురుచూపులు. అయినా ఏపీ ప్రభేత్వం తగ్గేదేలేదంటూ మరో రెండు సంక్షేమ పధకాలకు శ్రీకారం చుట్టింది. రేపటి దినం నుండి లాంఛనంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పధకాల అమలుకు సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం నేడు ప్రారంభించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సాఆర్ షాదీ తోఫా పేరుతో పధకాలను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

పెళ్లి అయిన 60 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.  కావాల్సిన డాక్యుమెంట్స్‌ సమర్పించాలి. అర్హులైన వారందరికీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు ఉన్న లబ్ధిదారులకు ఈ సాయం అందేలా ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి:  తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

Exit mobile version