Site icon Prime9

AP Press Academy : ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి..

ap press academy ex chairman devireddy srinath reddy passed away

ap press academy ex chairman devireddy srinath reddy passed away

AP Press Academy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిది స్వస్థలం కడప జిల్లా లోని సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె. కాగా ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో శ్రీనాథ్ రెడ్డి పీజీ చేశారు. ఆ తర్వాత జర్నలిజం లోకి వచ్చారు. ఆ తర్వాత వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. 24 ఏళ్ల పాటూ ఏపీయూడబ్ల్యుజే కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే రాయలసీమ ఉద్యమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి వంటి నేతలతో కలిసి పనిచేశారు.

2019 నుంచి 2022 వరకు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’ పేరుతో కాలమ్స్ రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దేవిరెడ్డి మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version