Site icon Prime9

AP Government : విశాఖలో మంత్రులు, అధికారులకు క్యాంప్ కార్యాలయాలు కేటాయింపు..

ap government identified camp offices to officers and ministers

ap government identified camp offices to officers and ministers

AP Government : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా  భాగంగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో రాష్ట్ర మంత్రులు, అధికారులకు క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు.

విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ (ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వీటిని వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక, వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు. ఇక ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఏపీలో ఆసక్తికర ఘటన జరిగింది. మరి దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Exit mobile version