Site icon Prime9

AP Global Summit 2023: విశాఖ నుంచే పాలన చేయబోతున్నా.. మరోసారి స్పష్టం చేసిన వైఎస్ జగన్

AP Global Summit 2023

AP Global Summit 2023

AP Global Summit 2023: ఆంధ్రప్రదేశ్ దేశ ప్రగతిలో ఎంతో కీలకంగా మారిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని ఆయన అన్నారు.

దాదాపు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని వెల్లడించారు. విశాఖ పట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది.

 

త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని(AP Global Summit 2023)

ఈ సందర్భంగా జగన్ మరోసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖ పట్నం పరిపాలన రాజధాని అవుతుంది’ అని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు.

భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని, రాష్ట్రంలో పారిశ్రామిక విధానం సులువుగా ఉందన్నారు.

ఏపీలో క్రీయాశీలక ప్రభుత్వం ఉందని .. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందన్నారు.

తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నట్టు.. త్వరలోనే అది సాకారమవుతుందన్నారు.

మరోవైపు ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నమని పేర్కొన్నారు.

వైఎస్ జగన్. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయని తెలిపారు.

తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఒక్క ఫోన్‌ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తామని.. భవిష్యతులో గ్రీన్‌, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని జగన్ అన్నారు.

 

వైజాగ్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్ లో పెట్టుబడులకై  కీలక వ్యాఖ్యలు చేశారు.

 

సౌర విద్యుత్‌లో రిలయన్స్‌ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ముందుంది. సమ్మిట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో జియో నెట్ వర్క్ అభివృద్ది చెందింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ మంచి సహకారం అందిస్తోంది. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీలో పెట్టుబడులు ప్రకటించారు. సౌర విద్యుత్‌ రంగంలో రిలయన్స్‌ పెట్టుబడులు పెడుతుందని.. ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని నవీన్ జిందాల్‌ తెలిపారు.

జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందని.. ఏపీలో జిందాల్‌ స్టీల్స్‌ రూ. 10వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పిస్తామన్నారు.

 

ఏపీలో నైపుణ్యం కలిగిన యువతకు కొదవ లేదని జిఎంఆర్ గ్రూప్ ఛైర్మ‌న్ మ‌ల్లిఖార్జున‌రావు అన్నారు.

ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంది.

ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ విజన్‌ అద్భుతమని తెలిపారు.

 

ఏపీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ తెలిపారు.

ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ కనెక్టివిటీ బాగుందని ఆయన అన్నారు.

 

ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉందని ఒబెరాయ్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ బబెరాల్‌ అన్నారు.

ఏపీ పర్యాటక విధానం ఉత్తమంగా ఉందని.. పర్యాటక రంగంలో ప్రీమియర్‌ డెస్టినేషన్‌గా ఏపీ నిలుస్తోందని కితాబిచ్చారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar