YS Abhishek Reddy Died: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీప బంధువు, కజిన్ డాక్టర్. వైఎస్ అభిషేక్ రెడ్డి(36) మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వైఎస్ అభిషేక్.. వైఎస్ జగన్‌కు సోదరుడు వరుస అవుతారు. వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసులోనే అభిషేక్ మరణించడంతో పార్టీ శ్రేణులు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం పులివెందులలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
YS Jagan Mohan Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి
