Site icon Prime9

Chalo Vijayawada: చలో విజయవాడ కార్యక్రమం వాయిదా..

Andhra Pradesh: సీపీఎస్ రద్దు కోరుతూ’సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రత దృష్ట్యా కార్యక్రమాలను నిలిపివేశామన్నారు. రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం నెలకొన్న విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడంతో ఉద్యోగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడంతో దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందర్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. మూడు రోజులు తమ అదుపులోనే ఉంచుకుంటామని హెచ్చరించారు. బైండోవర్‌ చేసి, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పూచీకత్తు బాండ్లు రాయించుకున్నారు. జిల్లాల సరిహద్దులోనూ ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సీపీఎస్ అంశం పై కసరత్తును ప్రారంభించింది. సీపీఎస్ కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Exit mobile version
Skip to toolbar