Site icon Prime9

AP CM YS JAGAN : వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన సీఎం జగన్..

ap cm ys jagan started ysr yantra seva scheme in guntur

ap cm ys jagan started ysr yantra seva scheme in guntur

AP CM YS JAGAN : ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈ మేరకు  రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ కూడా నడపడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలువురు రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు. మొత్తం రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం రైతన్నలకు ఇచ్చారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అనంతరం రైతుల గ్రూప్ ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీని జమ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో జగన్ (AP CM YS JAGAN ) మాట్లాడుతూ.. వైఎస్సార్ యంత్ర సేవా పథకం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. అక్టోబర్ లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలను అందిస్తామని తెలిపారు. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇ‍ప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ. 361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం.

 

రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం అని.. అందుకు నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోందని సీఎం (AP CM YS JAGAN) స్పష్టం చేశారు. ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశామన్నారు. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశామని సీఎం చెప్పారు. ఈరోజు 3,919 ఆర్బీకే స్థాయిలో, మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి స్టార్ట్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా 15 లక్షల రూపాయలు కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెప్పి.. వాళ్లు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షలతో వారి అవసరాల మేరకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. 491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశామని ఆయన చెప్పారు.

Exit mobile version