Site icon Prime9

AP Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. మెగా డీఎస్సీపై మంత్రి సమాధానమిదే?

AP Assembly Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 24న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించారు. ఇక, ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.22 లక్షల కోnaraట్ల వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్, గోదావరి పుష్కరాలు, వక్ఫ్ ఆస్తుల రికార్డు డిజిటలైజేషన్, గిరిజన యువతకు ఉపాధి, మాదక ద్రవ్యాల వినియోగం, మహిళలు, చిన్నారుల అఘాయిత్యాలు వంటి అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్పీపై ప్రశ్న సంధించి వైసీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు హాజరుకాకపోయినా సమాధానం ఇస్తామన్నారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ. 3 వేల కోట్లు అవసరమన్నారు. ‘మన బడి మన భవిష్యత్తు’నినాదంతో ప్రహారీలు కూడా నిర్మిస్తామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. ప్రధానంగా అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Exit mobile version
Skip to toolbar