Site icon Prime9

Nara Chandrababu : చంద్రబాబు నాయుడు మరో షాక్.. ఈసారి అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో

amaravathi inner ring road allegation by cid on chandrababu naidu

amaravathi inner ring road allegation by cid on chandrababu naidu

Nara Chandrababu : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ మరో షాక్ ఇవ్వబోతుందని సమాచారం అందుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ అవ్వగా.. ఇప్పుడు మరో కేసులో కూడా ఆయనపై పిటిషన్ వేసేందుకు సీఐడీ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించిన కేసులో చంద్రబాబును విచారించేందుకు అనుమతి కోరుతూ సీఐడీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా టాక్ నడుస్తుంది.

ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరనున్నట్టుగా తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నారాయణ, మరి కొందరిపై సీఐడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా నారాయణ, ఏ6 గా నారా లోకేష్‌ ఉన్నారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేసులో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా గాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీ బంద్ కి పిలుపునివ్వగా.. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, షాప్ లను తెదేపా నేతలు మూసేయిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Exit mobile version