Site icon Prime9

Devineni Uma: వైకాపాలో 80 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. దేవినేని ఉమ

80 rebel MLAs in Vaikapa..Devineni Uma

80 rebel MLAs in Vaikapa..Devineni Uma

Andhra Pradesh: సీఎం జగన్ కుప్పం పర్యటన పై ఇంకా రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గలేదు. కుప్పం వేదికగా మాజీ సీఎం చంద్రబాబులపై జగన్ పలు ఆరోపణలు చేసారు. చేతకాని సీఎంగా అభివర్ణించారు. దీంతో ఎదురుదాడికి తెదేపా దిగింది. తాజాగా తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ వైకాపా పై పలు ఆరోపణలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీలో 80మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ జోస్యం చెప్పారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని జగన్ కుప్పంలో ఏం పీకుతారని వైకాపా వర్గంలో గాబరా పుట్టించారు.

నందివాడ మండలంలో సాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో మాజీ మంత్రులు ఉమ, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసిన గుడివాడలో పాదయాత్ర నిర్విఘ్నంగా సాగుతూ ముందుకెళ్లిందన్నారు. పాదయాత్ర ప్రాంతంలో వీధి లైట్లు లేకుండా చేసి మాజీ బూతుల మంత్రి దిగజారాడని కొడాలి నానిని దుయ్యబట్టారు. రుషి కొండను, బోడి కొండగా మార్చిన ఘనకీర్తిని వైకాపా నేతలు అందుకొన్నారని ఎద్దేవా చేసారు. జగన్ గ్యాంగ్ విశాఖలో భూములను కబ్జా చేసారని ఆయన ఆరోపించారు.

అమరావతి పాదయాత్రను అడ్డుకొంటామని వైకాపా నేతలు పదే పదే హెచ్చరించినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిన్నటిదినం గుడివాడలో చోటుచేసుకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమైనారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, సీఐలు, సీఆర్పీ దళాలు రెండు తోపాటు 600 మంది పోలీసులు పర్యవేక్షణలో పాదయాత్ర ఆధ్యంతం ఉత్కంఠ వాతావరణంలో సాగింది. పాదయాత్రలో ఆకర్షణగా నిలిచిన శ్రీనివాసుని రధంతో పాటు మహిళా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు రక్షణగా నిలవడంతో పాదయాత్ర గుడివాడను దాటింది.

మరోవైపు గుడివాడ పాదయాత్రలో తలెత్తిన ఉద్రిక్తతతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనింది. విశాఖలో మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ అమరావతి రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడడం తప్పేనంటూ వైకాపా వర్గీయల పై ఆయన సీరియస్ అయ్యారు. అయితే కొంత సేపటి తర్వాత వైకాపా పెద్దల నుండి వచ్చిన ఆదేశాలతో అమరావతి రైతులను అడ్డుకొనేందుకు తమ ప్రభుత్వానికి 5 నిమిషాలు పట్టదని మరో కౌంటర్ ఇచ్చారు. అయితే మా ఉద్ధేశం అది కాదంటూ నర్మగర్భంగా మాట్లాడడం పై న్యాయస్ధానాలకు ప్రభుత్వం భయపడిన్నట్లుగా ఉంది.

Exit mobile version