Site icon Prime9

Kakinada: కాకినాడలో 30 మంది విద్యార్దులకు అస్వస్దత

Students-Fell-Sick-Kakinada

Kakinada: కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్ధులు కోలుకుంటున్నారని సమాచారం.

అయితే విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలను చెప్పలేకపోతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలు తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను వైద్యులు సేకరించారు.

Exit mobile version
Skip to toolbar