Road Accident : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 22 మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 

  • Written By:
  • Updated On - November 1, 2023 / 01:25 PM IST

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా..  తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కు చెందిన 65 ఏళ్ల లలిత, అలాగే తమిళనాడు రాష్ట్రం మానియంబాడి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల కుబేంద్రన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.