Site icon Prime9

YSR Awards : వైఎస్ఆర్‌ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన.. ఎవరెవరికి అంటే ?

2023 YSR Awards for life time achievement and achievement list

2023 YSR Awards for life time achievement and achievement list

YSR Awards : ఏపీ సర్కారు.. గత రెండు సంవత్సరాలుగా “వైఎస్ఆర్” లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ఇస్తున్న ఇస్తున్న వసిహాయం తెలిసిందే. వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులకు ఈ వార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే  తాజాగా 2023 ఏడాదికి గాను మూడోసారి ఈ అవార్డులను ప్రకటించారు. తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత విజేతల్ని ఎంపిక చేయడం జరిగింది.

ఈ అవార్డుల ఎంపిక కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు– ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు.  ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేయగా.. వాటిలో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు,, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి. ఇక వైఎస్సార్‌ జీవిత సాఫల్యం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్‌ సాఫల్యం కింద రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు.

“వైఎస్ఆర్” లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, అచీవ్ మెంట్ విజేతల వివరాలు (YSR Awards).. 

వ్యవసాయం.. 

శ్రీమతి పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

శ్రీ వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌.. 

యడ్ల గోపాలరావు – రంగస్థల కళాకారుడు – శ్రీకాకుళం

తలిసెట్టి మోహన్‌ – కలంకారీ– తిరుపతి

కోట సచ్చిదానంద శాస్త్రి – హరికథ – బాపట్ల

కోన సన్యాసి– తప్పెటగుళ్ళు – శ్రీకాకుళం జిల్లా

ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ – కాకినాడ

ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు – కృష్ణా

రావు బాల సరస్వతి– నేపథ్య గాయని – నెల్లూరు

తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు – ప్రకాశం

చింగిచెర్ల కృష్ణారెడ్డి – జానపద కళలు – అనంతపురం

కలీసాహెబీ మహబూబ్‌ – షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు – నాదస్వరం – ప్రకాశం

తెలుగు భాష – సాహిత్యం.. 

ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి

ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు

అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు..

పుల్లెల గోపీచంద్‌– గుంటూరు

కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం

వైద్యం..

ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌

ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌

మీడియా.. 

గోవిందరాజు చక్రధర్‌ – కృష్ణా

హెచ్చార్కే – కర్నూలు

సమాజ సేవ..

బెజవాడ విల్సన్‌ – ఎన్టీఆర్‌

శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ – (ఎచీవ్‌మెంట్‌)

నిర్మల హృదయ్‌ భవన్‌ – ఎన్టీఆర్‌

జి. సమరం – ఎన్టీఆర్‌

 

Exit mobile version