Bhuma Akhila Priya: తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల కోర్టు వారికి 14 రోజుల డిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. వారిద్దరిని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు.
14 రోజుల డిమాండ్.. (Bhuma Akhila Priya)
తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల కోర్టు వారికి 14 రోజుల డిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు.. వారిద్దరిని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియ, ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
భగ్గుమన్న విభేదాలు..
నంద్యాల తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం లోకి ప్రవేశించింది.
ఈ మేరకు కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు లొకేశ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా ఈ తరుణంలోనే ఏవీ సుబ్బారెడ్డి పై అఖిల ప్రియ వర్గం దాడికి తెగబడ్డారు. తనపై దాడి చేయడంపై ఏబీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు ఏవీ. వెంటనే పోలీసులతో పాటూ టీడీపీ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.
ఆయన్ను తీసుకెళ్లి కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపగా.. ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు.
ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు
దీంతో పోలీసులు భూమా అఖిల ప్రియతో పాటు మరికొందరిపై హత్యయత్నం కేసు నమోదు చేసి ఆళ్లగడ్డలో అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం నంద్యాలకు తరలించారు.
దీంతో జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది.
2019 ఎన్నికల సమయంలో కూడా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. మూడేళ్ల క్రితం ఏకంగా హత్యకు కుట్ర జరిగింది.. కానీ పోలీసులు కుట్రను భగ్నం చేశారు.
ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయగా.. మాజీ మంత్రి అఖిల ప్రియ సుఫారీ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా రెండు వర్గాలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు.