Site icon Prime9

DBT Funds: ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల

DBT Funds

DBT Funds

DBT Funds: ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిల్చిపోయిన సంక్షేమ పథకాల నిధులు తాజగా విడుదలయ్యాయి. ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. ఈ చర్యతో లబ్ధిదారులకు నగదు బదిలీ పక్రియ పున: ప్రారంభమైనట్లయింది . మిగిలిన పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఎన్నికల సంఘం అభ్యంతరంతో..(DBT Funds)

జనవరి నెల నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను పోలింగ్ కు రెండు రోజుల ముందు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది . అయితే ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఈ విధంగా నిధులు విడుదల చేస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఎన్నికల అభిప్రాయపడింది . ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతిపరులు, పథకాల లబ్ధిదారులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక్కరోజు సమయం ఇచ్చి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. నాయకులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. పోలింగ్ తర్వాత రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్ట్ తెలిపింది . దీంతో పోలింగ్ ముగియడంతో నిధుల పంపిణీ మొదలైంది.

అప్పట్లో దీనిపై కూడా ఎన్నికల సంఘం అనేక ప్రశ్నలు వేసింది . ఇన్ని రోజుల నుంచి ఇంత సొమ్ము జమ చేయకుండా ఇప్పుడే ఇవ్వడానికి కారణాలు చెప్పాలని, అసలు అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడ సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలింగ్ ముందు రోజు పడాల్సిన నిధులు లబ్ది దారుల ఖాతాల్లో జమ కాకుండా పోయాయి.

Exit mobile version