Dead body on Bike: పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి చెందగా, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి అధికారులు అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడంతో కుటుంబ సభ్యులు మోటార్‌సైకిల్‌పై 27 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
వ్యాను ఢీకొని ..(Dead body on Bike)
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సాలూరు మండలం గంజాయిభద్రకు చెందిన గెమ్మెల విశ్వనాథ్ (25) బుధవారం పొట్టంగి (ఒడిశా) తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా కుందిలి సంత సమీపంలో వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొట్టంగి పీహెచ్‌సీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పొట్టంగికి 27 కిలోమీటర్ల దూరంలోని గంజాయిభద్రకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారు. దీనితో విశ్వనాథ్ మృతదేహాన్ని బైక్‌పై గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.