Site icon Prime9

Adilabad Airport: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

Airport authority Green Signal For Adilabad Airport: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించి పౌర విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలిపినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు ఆదిలాబా ద్ ఎయిర్ పోర్ట్‌కు అనుమతులు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar