Site icon Prime9

Srinivas Goud: కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆర్ సీఎం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

srinivas goud

srinivas goud

Srinivas Goud: కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బుధవారం ఆయన టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆరేనని ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఈ విషయాన్ని తాను చండూరు లో చెప్పినట్టుగా వివరించారు. మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలుదేరుతారని మంత్రి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు.. ఎవరు కాదన్నారు. చిరంజీవి పార్టీ గతంలో పోటీ చేయలేదా అని అన్నారు. మునుగోడులో ప్రజలు తమ వైపు ఉన్నారని, బీజేపీ ప్రజలను గందరగోళపరిచే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. కానీ మునుగోడు ప్రజలు బీజేపీని నమ్మరని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలన్నారు.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని బీజేపీ నేతలు చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచిన తర్వాత ఒక్కహామీని కూడా బీజేపీ నిలుపు కోలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో మత కల్లోలాలకు బీజేపీ తెర లేపుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక మతం పేరుతో ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తుందని వీజేపీపై ఆయన మండిపడ్డారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.హైద్రాబాద్ లో బీసీ లకు తెలంగాణ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నట్టు ఢిల్లీ లో ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు కట్టడం లేదన్నారు.అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా అని మంత్రి ప్రశ్నించారు. మునుగోడు లో ఎదో జరిగితే ఆ పేరు చెప్పి తెలంగాణను నాశనం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు. తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలని ఆయన కోరారు. భారత్ జోడో యాత్ర పేరుతో మునుగోడులో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహాయం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీజేపీని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు.

నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ ను కేసీఆర్ తరిమారని,సొరియాసిస్ లాంటి బీజేపీ ని కూడా సాగనంపుతారని అన్నారు. టీఆర్ఎస్ వైపు ధర్మం ఉంటే బీజేపీ వైపు అధర్మం ఉందన్నారు. మునుగోడు లో ధర్మమే గెలుస్తుందని ఆయన్నారు.పెరిగిన ధరలను గుర్తుంచుకొని బీజేపీ కి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు.

Exit mobile version