Trauma Care Centre: నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్‌కు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్దాపన చేసారు. ఏడీపీ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దీనిని నిర్మిస్తోంది.హైదరాబాద్-విజయవాడ హైవే (NH 65) పై రోడ్డు ప్రమాద బాదితులకు తక్షణ చికిత్సను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
గోల్డెన్ అవర్ చాలా కీలకం..(Trauma Care Centre)
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకం దీనిని తరచుగా ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఈ సమయంలో వెంటనే అత్యవసర చికిత్సను అందించినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చు. గాయాల తీవ్రను తగ్గించవచ్చు. హైదరాబాద్-విజయవాడ హైవే పై ఉన్న ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల తీవ్రను దృష్టిలో ఉంచుకుని దీనిని ట్రామా కేర్ సెంటర్ ను కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణానికి ముందుకు వచ్చిన ఏడీపీ ఇండియాను మంత్రి వెంకటరెడ్డి అభినందించారు. త్వరలోనే ఇది ప్రారంభమయి సేవలందించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్-విజయవాడ హైవే (NH 65), 17 బ్లాక్‌స్పాట్‌లను కలిగి ఉంది. ఇక్కడ 500 ప్రమాదాలు జరిగాయి. 2023-24లో ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 120 మంది ప్రాణాలు కోల్పోయారు.