Site icon Prime9

Actor Brahmanandam: కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన నటుడు బ్రహ్మానందం

Actor Brahmanandam

Actor Brahmanandam

Actor Brahmanandam: తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తెలుగు సినీ నటుడు బ్రహ్మానందం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. బ్రహ్మానందం కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి కార్డును ఆయన సతీమణి శోభతో కలిసి ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులను కేసీఆర్ అభినందించి వారితో కాసేపు ముచ్చటించారు.

వధువు గైనకాలజిస్ట్ ..(Actor Brahmanandam)

బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్ళి త్వరలో జరుగనుంది. అతనికి కాబోయే భార్య కరీంనగర్ లోని  ప్రముఖ గైనకాలజిస్ట్‌ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్‌ పద్మజ–వినయ్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఐశ్వర్య . ఆమె కూడా తన తల్లిలాగే గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్‌ చేసినట్లు సమాచారం. సిద్ధార్థ్, ఐశ్వర్యల వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. కెసిఆర్ దంపతులకి బ్రహ్మానందం దంపతులు శుభలేఖ అందించారు.

 

Exit mobile version