Site icon Prime9

Kishan Reddy: వెయ్యి మంది కేసీఆర్ లు, వెయ్యి మంది ఓవైసీలు వచ్చినా కూడా మోదీని ఓడించలేరు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Telangana: పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభాన్ని పురస్కరించుకొని భైంసా సమీపంలో మంగళవారంనాడు సభను నిర్వహించారు.ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించారని కేసీఆర్ సర్కార్ పై ఆయన మండిపడ్డారు.. బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి బీజేపీని అడ్డుకొంటానని కేసీఆర్ కలలు కంటున్నాడని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెయ్యి మంది కేసీఆర్ లు, వెయ్యి మంది అసదుద్దీన్ ఓవైసీలు వచ్చినా కూడ మోదీని ఓడించలేరన్నారు.కేసీఆర్ కు రాజకీయ పార్టీలపై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ఉద్యమాలను అణచివేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు.తెలంగాణ గవర్నర్ మహిళా అని చూడకుండా ఆమెను అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

ఇసుక , గ్రానైట్, సున్నపు క్వారీలు కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఎక్కడ భూములు కనిపించినా ధరణి పేరుతో ఆక్రమించుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకే కేసీఆర్ దళిత బంధును తీసుకువచ్చారని ఆయన అన్నారు.

Exit mobile version