TSRTC: టిఎస్ఆర్టీసీలో 80 కొత్త బస్సులు

తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్‌టిఆర్ మార్క్ వద్ద ఈ బస్సులని రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులున్నాయి.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 12:34 PM IST

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్‌టిఆర్ మార్క్ వద్ద ఈ బస్సులని రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులున్నాయి.

త్వరలో 1,050 కొత్త డీజిల్ బస్సులు..(TSRTC)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 400 కోట్ల రూపాయల విలువైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.తెలంగాణ అంతటా మహిళలకు ఉచిత బస్సు సేవలను అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిలో 400 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ మరియు 56 ఎసి రాజధాని బస్సులు ఉన్నాయి.ఈ బస్సులను దశలవారీగా మార్చి 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేషన్ యోచిస్తోంది.