Site icon Prime9

Nakkapally Government Hospital: నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇంజక్షన్లు వికటించి 24 మందికి అస్వస్దత

Nakkapally

Nakkapally

Nakkapally Government Hospital: ఇంజక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురైన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల వివిధ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. అయితే డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే వాంతులు, వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్య పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం , డి ఎల్ పురం, ఉపమాక తదితర గ్రామాలకి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

 

 

 

Exit mobile version