Tammineni Krishnaiah Murder Case: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు రిమాండ్

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది ఖమ్మం కోర్టు. హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు

  • Written By:
  • Updated On - August 20, 2022 / 01:16 PM IST

Khammam: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది ఖమ్మం కోర్టు. హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులు బోడపట్ల శ్రీనివాసరావు, గజ్జి కృష్ణ, నూకల లింగయ్య, బండారు నాగేశ్వరరావు, కన్నెగంటి నవీన్‌, జక్కంపూడి కృష్ణయ్య, మల్లారపు లక్ష్మయ్య, ఎస్‌ కే రంజాన్‌ లను జిల్లా జైలుకు తరలించారు.

నిందితులు హత్యకు ఉపయోగించిన ఐదు మారణాయుధాలు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, తొమ్మిది సెల్ ఫోన్లతో పాటు 2 వేల రూపాయల నగదు సీజ్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్యలు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు పోలీసులు కోర్టుకు సంబంధించిన రిపోర్టు సంచలనంగా మారింది. నిందితులను 18వ తేదీన పట్టుకున్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం 17వ తేదీనే నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. దీంతో పోలీసు నివేదిక పై విమర్శలు వస్తున్నాయి.