Site icon Prime9

Winter Skin Care: చలికాలంలో చర్మ సౌందర్యానికి చిన్న చిట్కాలు

winter skin care health tips

winter skin care health tips

Winter Skin Care: చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన దుస్తులు, ఆహారపు అలవాట్లు, సౌందర్య చిట్కాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా వహించాలి. చల్లని వాతావరణంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారి దురద, ఇతర అలర్జీలకు దారితీస్తుంది. అలాగే చర్మం, పెదవులు, బుగ్గలు ఇంకా పాదాల పగుళ్లు ఏర్పడి రక్తం కారే సందర్భాలు లేకపోలేదు. కాబట్టి కేవలం చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే సరిపోదు, అంతకు మించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చర్మానికి బయటి నుంచే కాకుండా, లోపలి నుంచి కూడా సంరక్షణ అందిచాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అందుకు గానూ మంచినీరు జ్యూస్ లాంటి నీరు ఎక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోవాలి. వీటి వల్ల చర్మం ఎల్లవేళలా తేమగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మాన్ని కొన్ని రకాల ఇంటి చిట్కాలతో కూడా హైడ్రేట్ గా ఉంచవచ్చు.

కొబ్బరి నూనెతో మసాజ్
కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం ద్వారా దానిలో ఔషధ గుణాలు చర్మంలోపలికి ఇంకిపోయి చర్మాన్ని మృదువగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు అర చెంచా నూనెను రెండు చేతులకు రాసి రెండు నిమిషాల పాటు మీ చేతులు, కాళ్లను మసాజ్ చేయండి. ఉదయాన్నే లేచి స్నానం చేయండి.

 తేనెను అప్లై చేయండి
తేనె ఆరోగ్యానికికే కాకుండా చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చేతులు, కాళ్లకు తేనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కడిగేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ మసాజ్

పెట్రోలియం జెల్లీ చర్మంపై ఔషధంలా పనిచేస్తుంది. పొడి చర్మాన్ని నిర్మూలించటంలో పెట్రోలియం జెల్లీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బాదం నూనెతో మసాజ్ 
బాదం నూనె చర్మానికి టానిక్‌గా పనిచేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఈ నూనె చర్మానికి జీవం పోస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం కూడా చేస్తుంది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా శీతాకాలంలో మీ చర్మాన్ని పొడిబారకుండా ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు.

 

Exit mobile version
Skip to toolbar