Remedies for White Hair Control: ప్రస్తుతం జీవినశైలి కారణంగా ఎన్నో రకాల సమ్యలు వెంటాడుతున్నాయి. అయితే బిజీ లైఫ్ కారణంగా వాటిని పట్టించుకునే టైం లేకపోవడంతో అవి రాను రాను తీవ్రమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా యువతను వెంటాడనే సమస్య హెయిర్ ఫాల్, వైట్ హెయిర్. చాలా మందిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ వల్ల యుక్త వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. చిన్న పిల్లలు సైతం తెల్ల జుట్టుతో బాధపుడుతున్నారు.
సాధారణంగా జుట్టు తెల్లబడటం అనేది వృద్ధుల్లో కనిపిస్తుంది. 35 ఏళ్ల పైబడిలో వారికి తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది. దీనికి కారణం మన శరీరంలో మెలానీన్ స్థాయి తక్కడమే. వయసు పెరిగే కొద్ది శరీరంలో మెలానీన్ స్థాయి తగ్గుతుంది. దాంతో మెల్లిమెల్లి నట్టు తెల్లగా మారుతుంది. ఇదివృద్ధాప్యానికి సంకేతం. కానీ ప్రస్తుతం లైఫ్ స్టైల్, దుమ్ము, కాలుష్యం, కలుషిత ఆహారం వల్ల చిన్న పిల్లలు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెమిల్స్, రంగులు, హెన్నా లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకనేందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
తలస్నానానికి మార్కెట్లో దొరికే కెమికల్ షాంపూలు కాకుండ సాంప్రదాయమైన షాంపుల వాడటం ఉత్తమం. పూర్వకాలంలో చాలా మంది కుంకుడి రసంతో తలస్నానం చేసేవారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ కారణంగా దానికి రెగ్యులర్ పాటించడం సాధ్యం కానీ పరిస్థితి. అయితే నెలలో నాలుగైదు సార్లు అయినా అవి పాటించడానికి ట్రై చేయడం మంచిది. లేదా ఇలాంటి సహాజమైన హోం రెమెడీల పాటిస్తూ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
మందారం
మందారంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. తరచూ మందార ఆకులు లేదా పువ్వులు జుట్టుకు పట్టించడం వల్ల కురులు నిగనిగలాడుతూ ఆరోగ్య వంతంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మందార పువ్వు జుట్టుని నల్లగా మార్చు గుణం కూడా ఎక్కువే. మందారం పువ్వుల్లో విటమిన్ సి, అమైనో అమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వాడే పద్దతి: సాధారణంగా మీరు వాడే కొబ్బరి నూనెలో మందార పువ్వులు, ఆకులు వేసి మరిగించాలి. బాగా మరిగించాక నూనె చల్లార్చిన తర్వాత ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేయాలని. ఇలా చేస్తూ తెల్ల జుట్టు మెల్లిమెల్లిగా నల్లగా మారుతుంది.
కరివేపాకు..
కరివేపాకు జుట్టు చాలా మంచిదనే విషయం అందరికి తెలిసిందే. కానీ దీనికి దినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుని దృఢంగా ఉంచుతుంది. అలాగే మెలనీన్ స్థాయిని పెంచి జుట్టుని నల్లబడేల చేయడం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకు నిపుణులు సైతం కరివేపాకు తినాలి చెబుతుంటారు.
వాడే పద్ధతి: తెల్ల జుట్టుతో బాధపడే వారు తమ రోజు ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ నూనెను వడకట్టి తలకు పట్టించాలని. ఇలా వారానికి రెండు మూడు సార్లు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడతారు.
ఉల్లిపాయ రసం
సాధారణంగా మన ఇంట్లోని పెద్దవాళ్లు జుట్టుకు ఉల్లిరసం పెడుతుంటారు. ఇది ఇప్పటి వారికి తెలియదు. కానీ ఈ ఉల్లి రసంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసంలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది తెలుసు. జట్టు, చర్మ రక్షణలో ఎంతగానో ఉపయోగపుడుతంది. ఇది జుట్టు మూలాలను దృఢంగా చేయడంతో పాటు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సాహాయపడుతుంది.
వాడే పద్ధతి: తాజా ఉల్లిపాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి. ఈ రసాన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రపర్చుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇవ్వడంతో పాటు బలంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. తరచూ ఊసిరిని వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా ఉసిరి మెరుగ్గా పనిచేస్తుందట
వాడే పద్ధతి: ఉసిరి రసం తాగడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. అలాగే ఉసిరి నూనెతో తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోండి. ఇంకా ఉసిరి పొడిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించడం వల్ల మేలైన ఫలితాలు ఉంటాయి.
గోధుమ గడ్డి:
గోధుమ గడ్డితో కూడా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో గోధుమ గడ్డి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను కూడా బలంగా, దృఢంగా ఉంచడంలో అద్భుతంగా పని చేస్తుంది. గోధుమ గడ్డిని మీ ఆహారాలతో పాటు కలిపి తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయ అంటున్నారు నిపుణులు.