Site icon Prime9

Health Benefits Of Garlic: వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

garlic prime9news

garlic prime9news

Garlic Benefits: మన ఇంట్లో వెల్లుల్లి లేకుండా ఏ వంటలు చేసుకోలేము. ప్రతి దానిలో వెల్లుల్లి ఒక్క రెబ్బ ఐనా వేసుకుంటాము. ఎందుకంటే దీనిలో ఔషధ గుణాలున్నాయని నిపుణులు పరిశోధనలో వెల్లడించారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా లేదా అన్నది ఇక్కడ చదివి తెలుసుకుందాం. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా దొరుకుతాయి. ఇక ఇది ఇలా ఉంటే విటమిన్ సి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తోంది. మామూలుగా హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వెల్లుల్లిని ఎక్కువ తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచించారు.

వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు ఇవే..
1.కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి వెల్లుల్లి మేలు చేస్తుంది.
2.కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
3.బ్లడ్ ప్రెజర్‌ను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది.
4.దీనిలో ఉండే యాంటీ ట్యూమర్ వల్ల క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా చేస్తుంది.
5.దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువుగా ఉంటాయి.

వెల్లుల్లి అధికంగా తీసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..

1.దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
2.గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
3.కడుపులో వికారంగా ఉంటుంది.
4.ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి.
5.డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

Exit mobile version