Site icon Prime9

Chia seeds: జాగ్రత్త.. చియా సీడ్స్‌ని ఈ పదార్థాలతో అసలు కలిపి తినకండి!

Chia Seeds Disadvantages: చియా సీడ్స్‌లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ విత్తనాల్లో ఫైబర్‌, ప్రొటిన్‌, ఒమేకా 2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాదు, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమ్యలసు దూరం చేస్తుంది. ఇక ఇందులో ఉండే యాంటియాక్సిడెంట్స్‌ని మీ శరీరంలోని వేడిని, ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు రోజు ఇవి తినడం వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

అందుకే ఈ మధ్య చాలా చియా సీడ్స్‌ని బాగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోజు ఉదయాన్ని తాగే స్మూతీలు, ఓట్స్‌తో కలిపి తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చియా సీడ్స్‌నితగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి డెంజర్‌ అంటున్నారు నిపుణులు. అంతేకాదు వీటిని నిలువ చేసే పద్దతి, తీసుకునే విధానంలో ఇలాంటి తప్పుడు చేస్తే ఆరోగ్యానికి హానికరమంటున్నారు. చియా సీడ్స్‌ని తినేప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు. మరి అవేంటో ఇక్కడ చూద్దాం.

చియా సీడ్స్‌ ఆరోగ్యానికి దివ్యౌషదం అంటారు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ ఇవి తినేటప్పుడు పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలట. తగిన మోతాదులో మాత్రమే ఇవి తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి కదా తొందరగా సన్నబడాలని కొందరు వీటిని అధిక మోతాదులో తీసుకుంటారు. అలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయట. ఇందులో ఉంటే రిచ్‌ ఫైబర్‌ కంటెంట్‌ని అధిక స్థాయిలో ఉంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అధికంగా తీసుకోవడం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అసమతుల్యతకు కూడా కారణమవుతుంది.

ఇలా నిల్ల చేయాలి.. లేదంటే!

చియా సీడ్స్‌ని నిల్వ ఉంచే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో పోషకాలు బయటకు పోకుండ ఓ కంటైనర్‌లో నిల్వ ఉంచాలి. ముఖ్యంగా వీటిని సూర్యరశ్వి, వేడి, తేమ తగలకుండ జాగ్రత్త నిల్వ చేయాలి. లేదంటే గాలికి ఇందులో పోషక విలువలు తగ్గుతాయి. అలాగే వెట్‌ ప్రదేశాల్లో పెట్టడం రాన్సిడిటీ, తేమ శోషణకు దారి తీస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందుకే వీటిని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయడం మంచిది.

నానబెట్టిన తర్వాతే తినాలి..

చియా గింజలను తప్పనిసరిగా నానబెట్టిన తర్వాత తినాలి. నానబెట్టకుండ పొడి గింజలు తింటే కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. అవి సరిగా జీర్ణం అవ్వక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దాంతో ఆ రోజంత మీరు అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి వీటిని నానబెట్టిన తర్వాతే తినాలి. నానబెట్టడం వల్ల నీటిని గ్రహించి సులభంగా జీర్ణం చేయడం, పోషక శోషనను పెంచుతుంది. వీటిని నీటితో పాటు పాలు, పెరుగు,బాదం పాలతో కలిసి నానబెట్టుకోవచ్చు. మీరు వీటిని తినడానికి ముందు 10-30 నిమిషాలు నాననివ్వాలి.

ఈ పదార్థాలతో అసలు కలపొద్దు!

అయితే చియా విత్తనాలను ఈ పదార్థాలతో కలిసి అసలు తినొద్దట. వీటి ప్రయోజనాలను పెంచడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చక్కెర కలిగిన ఆహారాలు, డ్రై నట్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌, స్నాక్స్‌తో కలిసి తినొద్దు. వీటితో వాటిని కలపడం వల్ల చియా సీడ్స్‌లోని పోషక విలువలు తగ్గిపోతాయి. అదే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలతో జత చేయడం వల్ల వాటి శోషణను పెంచి మిమ్మల్నీ ఆరోగ్యం ఉంచుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి చక్కెర పదార్దాలతో చియా సీడ్స్‌ని కలిపి తినడమ మానుకోండి.

తినడానికి ముందు ఇలా చేయండి!

చియా గింజలు తినేముందు వాటిని బాగా కలపాలి. నీటిలో వేయగానే ఇవి జల్‌ పదార్థంగా మారిపోతాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గింజలు అత్కక్కుని ఉండలా చుట్టుకుపోతాయి. వాటిని అలాగే సేవించడం వల్ల జీర్ణక్రియలో అసమానతలు ఏర్పడతాయి. కడుపులో జెల్ లాంటి ఆకృతిని ఏర్పరిచి అసౌకర్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ చియా గింజలను ఎలా తీసుకున్న ముందుగా వాటిని బాగా కలపాలని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version