Site icon Prime9

Spy Movie : నిఖిల్ “స్పై” టీజర్ రిలీజ్.. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ రివీల్ చేస్తారా ?

young hero nikhil spy movie teaser released

young hero nikhil spy movie teaser released

Spy Movie : యంగ్ హీరో నిఖిల్‌ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి భారీ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ… పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. అందుకే మళ్ళీ తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్‌ ను రివీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే టైటిల్ లోగోను కూడా డిజైన్ చేశారు.

కాగా తాజాగా ఈ మూవీ టీజర్ ని ఢిల్లీలోని కర్తవ్య పథ్ నేతాజీ విగ్రహం వద్ద లాంచ్ చేశారు. ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్.. యాక్షన్, సస్పెన్సు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. టీజర్ లోనే  కథపై హింట్ ఇచ్చేశారు దర్శకుడు. 1945లో కనపడకుండా పోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ స్పై మూవీ నడుస్తుందని తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటూ మనం చదువుకున్నాం. అయితే ఒక కవర్ స్టోరీ అని, అసలు నిజం ఈ సినిమాతో చెబుతాం అంటున్నాడు నిఖిల్. టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఇక మూవీలో ఫైనల్ గా హీరోకి తెలిసిన నిజం ఏమిటీ. వాస్తవాలు తెలుసుకునే క్రమంలో హీరో పడ్డ కష్టాల సమాహారమే స్పై మూవీగా భావించవచ్చు. మొత్తానికి అందరికీ నచ్చేసిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్  నటిస్తుంది. మకరంద్ దేశ్ పాండే కీలక రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంతకు ముందు క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.  చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథను కూడా అందించడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాస్తున్నారు. జూన్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేసారు.

 

 

Exit mobile version
Skip to toolbar