Site icon Prime9

Andhra Pradesh: నేడు వైసీసీ ప్లీనరీ షెడ్యూల్ ఇదే..

YCP Plenary Meeting: ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఫుల్‌ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరుగుతోన్న ప్లీనరీ సమావేశాలు తొలిరోజు విజయవంతం కాగా, నేడు రెండో రోజుతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి. తొలిరోజు నాలుగు తీర్మానాలు పెట్టి ఆమోదింపజేశారు. ఇక, పార్టీ చీఫ్‌, సీఎం వైఎస్‌ జగన్‌, విజయమ్మ, మంత్రుల ఉపన్యాసాలు ఆకట్టుకోగా రెండోరోజు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది వైసీపీ.

వైసీపీ రెండో రోజు ప్లీనరీ ఉదయం 9.45 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి 10.5 గంటల వరకు సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ విజయమ్మ, ఇతర ప్రధాన నేతలు వేదికపైకి చేరుకోనున్నారు. ఇక, సామాజిక సాధికారతపై ఉదయం 10.5 నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు మంత్రులు, ఎంపీలు మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 నుంచి 1.45 గంటల వరకు వ్యవసాయంపై చర్చ సాగుతోంది. ఇక, మధ్యాహ్నం 1.45 నుంచి 2 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి పరిశ్రమలు  ఎంఎస్ఎంఈ  ప్రోత్సాహకాలపై 2.40 గంటల వరకు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.40 నుంచి దృష్ట చతుష్టయంపై మంత్రులు అంబటి, జోగి రమేష్, ఎమ్మెల్యే కొడాలి నాని, పోసాని కృష్ణమురళి మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడి ముగింపు సందేశం ఉండనుండగా వందన సమర్పరణ, జాతీయ గీతాలాపనతో సాయంత్రం 5.10 గంటలకు ప్లీనరీ సమావేశాలు ముగించనున్నారు.

Exit mobile version
Skip to toolbar