Ycp MP Magunta Son Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని శనివారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆయన్ని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి 10 రోజుల కస్టడీ విధించింది.
కోర్టుకు సమర్పించిన మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సౌత్ గ్రూప్ పేర్లను కూడా ఈ కేసులో ఈడీ పొందుపరిచింది.
ఈ స్కామ్‌లో భాగంగా.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు విజయ్ నాయర్ ఖాతాలోకి వెళ్లాయని.. ఆయన ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో.. ఆ సంస్థలో ఉన్న శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌తో ఈడీ పేర్కొంది.
బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు.
గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది.
దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి.
(Ycp MP Magunta Son Arrest) సౌత్ గ్రూప్ ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాల ప్రకారం ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా ఉంది. అయితే పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు రాఘవ ఢిల్లీ రిటైల్ జోన్స్ లో రెండు జోన్లలో వ్యాపారం దక్కించుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారంలో ఎల్ 1 గా వచ్చిన ఇండో స్పిరిట్ కంపెనీ ప్రేమ్ రాహుల్ మండూరి పేరు మీదు 32.5 శాతం వాటాను రాఘవ పొందారు. ఈ స్కాంలో ముడుపుల వ్యవహారంలో రాఘవ కీలక పాత్ర పోషించాడని.. ఆప్ నేతలకు రూ.100 కోట్లను సౌత్ గ్రూప్ ముడుపులుగా ఇచ్చిన వ్యవహారంలో రాఘవ పాత్ర కూడా ఉంది. ఈ రూ.100 కోట్లలో రూ.31 కోట్ల ముడుపులు రాఘవ రెడ్డి ద్వారానే చేరినట్లు విజయ్ నాయర్ స్నేహితుడైన దినేష్ అరోరా చెప్పారు. అభిషేక్ బోయినపల్లితో కలిసి 31 కోట్ల రూపాయాలు హవాలా మార్గంలో మళ్ళించినట్లు దినేష్ అరోరా వెల్లడించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్యాంపు కార్యాలయం నుంచే విజయ్ నాయర్ పనిచేశారు.
అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి రూ.100 కోట్లు విజయ్ నాయర్ కు బదిలీ చేశారు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూపు లబ్ది పొందింది. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించేలా కేజ్రీవాల్ నివాసంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదేశించినట్లు ఆయన కార్యదర్శి అరవింద్ చెప్పారు. ఈ కుంభకోణం కారణంగా మొత్తం ప్రభుత్వ ఖజానాకు 2873 కోట్ల నష్టం వాటిల్లింది. మద్యం విధానం ప్రకారం ఉత్పత్తిదారులు హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో వుండకూడదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సుమారు 9 మంది ఈ కేసులో అరెస్ట్ కాగా .. ఈ కేసులో ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గౌతమ్ మల్హోత్రా ఢిల్లీలో ఉన్న బ్రికాంక్ కో అనే సేల్స్ ఆర్గనైజేషన్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ ఆప్ నేతలతో మల్హోత్రాకు పరిచయాలు ఉన్నాయని, వారి అండతోనే ఈ లిక్కర్ బిజినెస్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంపాదించిన డబ్బులను.. గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అతడు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/