Site icon Prime9

Writer Padmabhushan : మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్న రైటర్ పద్మభూషణ్ మూవీ టీమ్.. ఈరోజు ఆ థియేటర్స్ లో ఫ్రీ షో !

writer padmabhushan movie team special gift to womens by free shows

writer padmabhushan movie team special gift to womens by free shows

Writer Padmabhushan : సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం “రైటర్ పద్మభూషణ్”.

వైవిధ్యమైన రోల్స్ పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు సుహాస్.

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చాడు సుహాస్.

పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు.

లాక్ డౌన్ సమయంలో ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన “కలర్ ఫోటో” సినిమాతో హీరోగా భారీ విజయం అందుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఇటీవల అడివి శేష్ హీరోగా నటించిన హిట్-2 సినిమాలో సీరియల్ కిల్లర్ గా కనిపించిన సుహాస్ అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు తాజాగా రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

మహిళలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రైటర్ పద్మభూషణ్ మూవీ టీమ్..

ఈ నేపథ్యంలోనే తాజాగా రైటర్ పద్మభూషణ్ మేకర్స్.. మహిళల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు.

ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో ఈరోజు మహిళలకు ఉచితంగా సినిమా చూడొచ్చని తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ లో ఆయా థియేటర్ల వివరాలు కూడా వెల్లడించారు.

ఇక ఈ చిత్రం క్లైమాక్స్ లో అమ్మ సెంటిమెంట్ అందరితో కన్నీళ్ళు పెట్టిస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

 

యంగ్ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా టీనా శిల్పా రాజ్ నటించింది.

అలానే ఈ మూవీలో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, గౌరి ప్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించారు.

చాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ బ్యానర్‌పై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ ఈ మూవీని నిర్మించారు.

ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.

ఇక ‘రైటర్ పద్మభూషణ్’ విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

 

ఇటీవలే ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్విట్టర్ వేదికగా మూవీ టీమ్ ని అభినందించారు.

ఈ మేరకు మహేష్ బాబు ట్విట్టర్ లో  ”రైటర్ పద్మభూషణ్ సినిమా హృదయానికి హత్తుకునే సినిమా, ముఖ్యంగా క్లైమాక్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో నటించిన సుహాస్ యాక్టింగ్ బాగా నచ్చింది అంటూ సుహాస్ ని మహేష్ అభినందించాడు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version