Site icon Prime9

Jabardasth Comedian : ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ జబర్దస్త్ కమెడియన్ పై కేసు నమోదు..

women files case on jabardasth comedian nava sandeep

women files case on jabardasth comedian nava sandeep

Jabardasth Comedian : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ఈ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుని బ‌య‌ట‌కు వెళ్లి సిల్వ‌ర్ స్క్రీన్ మీద కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగా ఫోక్ సింగర్ గా, ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవ సందీప్ పటాస్, అదిరింది, కామెడీ స్టార్స్.. లాంటి పలు కామెడీ షోలలో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో గల్లీ బాయ్స్ సద్దాం టీంలో కనిపిస్తున్నాడు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ లో ఫోక్ పాటలతో అలరిస్తున్నాడు సందీప్.

నవ సందీప్ కమెడియన్ గా, సింగర్ గా జబర్దస్త్ షోలో పాల్గొంటున్నాడు. అలాగే అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో తన జానపద పాటలతో ప్రేక్షకులని అలరించాడు.  తాజాగా నవ సందీప్ పై కేసు నమోదయింది. గత కొన్నాళ్లుగా ప్రేమించి, శారీరికంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుండటంతో మొహం చాటేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో ఆ యువతికి పరిచయమైన నవ సందీప్ వాట్సాప్ చాట్ లతో మరింత దగ్గరయ్యాడు. అనంతరం ప్రేమ అని చెప్పి ఇద్దరూ హైదరాబాద్ లో తిరిగారు. శారీరికంగా కూడా కలిశారు. గత నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుండటంతో నవ సందీప్ స్పందించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై నవ సందీప్ ఇంకా స్పందించలేదు.

 

Exit mobile version