Site icon Prime9

NTR31: ఎన్టీఆర్‌ 31 నుంచి క్రేజీ అప్‌డేట్‌! – మూవీ షూటింగ్‌ ఎప్పుడంటే..

Jr NTR and Prashanth Neel NTR31 Shooting Update: మ్యాన్‌ ఆప్‌ మ్యాసెస్‌ ఎన్టీఆర్‌ అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ షూటింగ్‌కి సంబందించి ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుందట. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత ఎన్టీర్‌ వరుసగా మూడు సినిమాలకు సైన్‌ చేశాడు. అందులో కొరటాల శివతో దేవర, వార్‌ 2తో పాటు ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌31(NTR31) ఒకటి. ఇటీవల సైలెంట్‌గా ఈ మూవీ పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. దీంతో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇక ఎన్టీఆర్‌ దేవర మూవీ రిలీజ్‌ అవ్వడంతో అంతా NTR31 మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని డిసెంబర్‌లో NTR31ని సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఎన్టీఆర్‌ లేకుండా ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్‌ రెడీ అయినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో కొనసాగుతుంది. ఇది పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుందట. ఆ లోపు ఎన్టీఆర్‌ లేని సీన్స్‌తో NTR31 మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

వార్‌ 2 షూటింగ్‌ అయిపోగానే ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ సెట్లో అడుపెట్టనున్నాడు. అంటే ఫిబ్రవరిలోనే ఎన్టీఆర్‌ ఈ మూవీ సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా లాంచింగ్‌ రోజే రిలీజ్‌ని ప్రకటించి సర్‌ప్రైజ్ చేసింది మూవీ టీం. 2026 జనవరిలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ మూవీ లాంచింగ్ ముందు నుంచి NTR31కు డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉండగా.. పూజ కార్యక్రమంలో రోజు విడుదల చేసిన పోస్టర్‌ చూస్తే అదే టైటిల్‌ ఖామమనేలా ఉంది. పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌ జూమ్‌ చేసి చూస్తే ఇండియా మ్యాప్‌, పాకిస్తాన్‌,చైనా బార్డర్లు, గోల్డ్‌ మైన్‌ వంటి ఆసక్తికర అంశాలు కనిపించాయి.

ఈ సినిమా కథ కూడా చైనా, ఇండియా చూట్టూ తిరుగుతుందని సమాచారం. చైనా డ్రగ్స్‌ మాఫియా కోల్‌కత్తా అడ్డాగా డ్రగ్స్‌ సప్లై చేయడం చేస్తుంది. ఇది 1969లో కోల్‌కత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో దానిని చైనా వాళ్లు ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా మలుచుకునిఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ చేసేవారట. ఈ సంఘటన ఆధారం చేసుకుని ప్రశాంత్‌ నీల్‌ NTR31 కథను తనదైనస్టైల్లో రాసుకున్నారట. ఇందులో చైనా ప్రమేయం ఉండటంతో ఈ సినిమా డ్రాగన్‌ అనే పేరును అనుకుంటున్నట్టు సమాచారం. హైవోల్డేజ్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కబోయే ఈసినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన ‘సప్తసాగరాలు దాటి’ మూవీ హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ నటించనుందని టాక్‌.

Exit mobile version