Site icon Prime9

Maharashtra Elections 2024: సీఎం అయ్యేది ఎవరు? – ఏక్‌నాథ్‌ షిండే షాకింగ్‌ కామెంట్స్‌!

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపులో అధికార మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 288 స్థానాల్లో అధికారి బీజేపీ 229 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. ఇక మహాయుతి కూటమి గెలుపు ఖాయమైనట్టే. దీంతో కూటమిలో మహా పీఠాన్ని ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. మూడు పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు.

సీఎంగా ఉన్న ఏక్‌నాథ్‌ షిండేనే కొనపాగుతారాజ? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా.. వీరిద్దరు కాకుండా మహారాష్ట్రకు సీఎం కావాలనే ఆశయంతో ఉన్న అజిత్‌ పవార్‌ అవుతారా? అనేది ఉత్కంఠ నెలకోంది.  ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ముఖ్యంగా వినిపిస్తుంది. నిజానికి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌గా 145 సీట్లు రావాలి. అయితే అక్కడ బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఈ స్థానాల్లో వారి గెలుపు ఖాయంగా ఉంది. బీజేపీ సోలోగా 149 స్థానాల్లో గెలుపు ఖాయంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది.

దీంతో ఆ పార్టీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్‌ని సీఎం చేయాలనే వాదనలు ఉన్నాయి. ఈ మేరకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్‌ ధరేకర్‌ చెబుతున్నారు. అయితే రేపు అక్కడ బీజేఎల్పీ సమావేశం జరగనుందని, సమావేశం అనంతరం సీఎం ఎవరనేది నిర్ణయించి ప్రకటన ఇస్తారని మీడియాకు చెప్పారాయన. ఇదిలా ఉంటే సీఎం పీఠం ఎవరనేదిపై ఏక్‌నాథ్ షిండే అనుహ్యా వ్యాఖ్యలు చేశారు. గెలుపు సంబరాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే నిబంధన ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం లేదన్నారు. అంతా కూర్చుని మాట్లాడుకుని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. అజిత్‌ పవార్‌ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని ఆశిస్తుంది. ప్రజలు అజిత్‌ పవార్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారని, ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రస్తుతం మహాయుతి కూటమి గెలుపు సంబరాల్లో ఉండగా.. మరోవైపు సీఎం పీఠం ఎవరిది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా సమయం లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనే అంశంలో నాయకుల హైడ్రామాను తలపించే అవకాశం లేకపోలేదు.

Exit mobile version