Janasena Yuvashakthi: వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో యువత, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై, వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు.
పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు అంశాలు పక్కా..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఎవరైనా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఉన్నాడా? అని నిలదీశారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు అంశాలను పరిశీలించాలి. ఒకటి.. ఆ నేతను పార్టీ బాగా చూసుకోవాలి. ఇంట్లో జరుగుబాటుకు, అతడి పిల్లల ఖర్చులకు పార్టీ డబ్బులు ఇవ్వాలి. లేకపోతే అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తులైనా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ, రాజకీయాలు చేస్తూ పూర్తి స్థాయి రాజకీయనేతలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ రాజకీయాలు చేస్తున్నవాళ్లే.
కోర్టుల్లో కేసులు వాదిస్తూ కపిల్ సిబాల్ రాజకీయాలు చేయడంలేదా? చిదంబరం కూడా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయలేదా? నేను కూడా అంతే.. సినిమాలు చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్లి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చా? సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? నా పని నేను చూసుకుంటూనే దేశానికి, ప్రజలకు సమయం కేటాయిస్తున్నాను. నాకు డబ్బు అవసరం లేని సమయం అంటూ వస్తే ఆ రోజున సినిమాలతో సహా మొత్తం వదిలేస్తాను” అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్
Janasena Yuvashakthi: మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/