Site icon Prime9

Keerthy Suresh: కీర్తి సురేష్‌ కాబోయే భర్త ఆంటోని తట్టిల్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Unknown Facts About Keerthy Suresh Boyfriend Antony Thattil: ఎట్టకేలకు కీర్తి సురేష్‌ పెళ్లి ఖాయం అయ్యింది. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోని తట్టిల్‌తో ఈ ఏడాది చివరిలో ఏడడుగులు వేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కీర్తి సురేష్‌ పెళ్లిపై వార్తలు వచ్చాయి. కానీ ప్రతిసారి అవి ప్రచారానికే పరిమితం అయ్యాయి. కానీ ఈసారి కీర్తి కాబోయే వరుడు ఇతడే అంటూ అతడి పేరు, ఫోటో కూడా రివీల్‌ అయ్యింది. దీంతో ఈసారి కీర్తి పెళ్లి పీటలు ఎక్కడం దాదాపు ఖాయమైందని అంతా అభిప్రాయపడుతున్నారు.

15 ఏళ్ల పరిచయం

దీంతో కీర్తి చేసుకోబోయే వరుడు ఇండస్ట్రీకి చెందినవాడా? లేక బయటి వాడా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆంటోని తట్టిల్‌ గురించిన వ్యక్తిగత వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆంటోని తట్టిల్‌.. కీర్తి సురేష్‌ చిన్ననాటి మిత్రుడు. కేరళలోని కొచ్చికి చెందిన వాడు. అతడు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త. కొచ్చిలోనూ అతడికి చైన్ రిసార్ట్ బిజినెస్‌లు ఉన్నాయట. చెన్నైలోనూ పలు రిజస్టర్డ్‌ కంపెనీలు ఉన్నాయట. వీరిద్దరిది 15 ఏళ్ల పరిచయం. 2007-08 నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంటోని కీర్తి సురేష్‌ సీరియర్. మంచి స్నేహితులుగా ఉన్న వీరి కొన్నేళ్ల కిందట ప్రేమలో పడ్డారట.

అప్పటి నుంచి సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారు. అయితే కీర్తి ఎప్పుడు కూడా తన రిలేషన్‌ గురించి బయటపెట్టలేదు. అయితే రీసెంట్‌గా తన పెళ్లి రూమర్స్‌పై స్పందిస్తూ ఇప్పట్లో పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అయితే మీరు సింగిల్‌ అనుకోవచ్చా? అని అడగ్గా.. పెళ్లి చేసుకోననని చెప్పాను కానీ, సింగిల్‌ అని చెప్పలేదుగా అంటూ షాకిచ్చింది. దాంతో కీర్తి సురేష్‌ రిలేషన్‌లో ఉందని స్పష్టమైన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లి వార్తలతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌, కాబోయే వరుడు ఇతడేనంటూ ఆంటోని ఫోటో బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆంటోని ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

గోవాలో డిస్టినేషన్‌ వెడ్డింగ్‌

కాగా కీర్తి సురేష్‌-ఆంటోని తట్టిల్‌ గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ డిసెంబర్‌ 11, 12 తేదీల్లో వీరి పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌ అయ్యింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి హాజరుకానున్నారట. అయితే ఈ మధ్య సెలబ్రిటీల మీడియాకు కంట పడకుండ గప్‌చుప్‌గా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌, కియార-సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీ భగ్నానీలు ఎలాంటి ప్రకటన లేకుండ సైలెంట్‌ పెళ్లి చేసుకుని అనంతరం పెళ్లి ఫోటోలు విడుదల చేసి అందరి సర్‌ప్రైజ్‌ చేశారు. ఇప్పుడు వీరి బాటలోనే కీర్తి సురేష్‌ కూడా నడవాలనుకుంటుంది. పెళ్లి వేడుకుల నుంచి మూడుమూళ్లు పడేవరకు తన వివాహ ఏర్పాట్లను చాలా గోప్యంగా ఉంచాలనుకుంటుందట.

ఎలాంటి హడావుడి లేకుండ ప్రశాంతంగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రకటన ఇవ్వాలనుకుంటున్న సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కీర్తి సురేష్‌ తల్లి కూడా హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. హీరోయిన్‌ మేనక, నిర్మాత సురేస్‌ కుమార్‌ల కూతురే కీర్తి సురేష్‌. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన కీర్తి ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కెరీర్‌ మొదట్లో పెద్దగా సక్సెస్‌ చూడని కీర్తి.. ‘మహానటి’ ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ అందుకుంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారం నాగ్‌అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి గానూ ఆమె ఏకంగా నేషనల్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత సౌత్‌ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఇటీవల బేబీ జాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.

Exit mobile version