Site icon Prime9

West Bengal Cabinet Expansion: పశ్చిమ బెంగాల్‌ కేబినెట్‌ విస్తరణ దీదీ క్యాబినెట్లో బాబుల్‌ సుప్రియో

West Bengal Cabinet Expansion: పశ్చిమ బెంగాల్‌ లో కేబినెట్‌ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్‌లో యువరక్తాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కెబినెట్‌ను విస్తరించారు. మాజీ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు అవకాశం కల్పించారు. కేబినెట్‌ మార్పులు చేర్పుల్లో కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. పార్థాచటర్జీ టీచర్‌ రిక్రూట్‌స్కాంలో అరెస్టు అయ్యి ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న నేపథ్యంలో ఆయన పోర్టుపోలియోను కొత్త వారికి కేటాయించారు. కాగా ఇటీవల పలువురు నాయకులు మృతి చెందారు వారిలో సుబ్రతా ముఖర్జీ ఒకరు.

మమతా బెనర్జీ రెండవ సారి అధికారం చేపట్టిన తర్వాత అతి పెద్ద కేబినెట్‌ మార్పులకు శ్రీకారం చుట్టారు. గత 11 ఏళ్లతో కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసిన ఉదంతాలు చాలా తక్కువే. ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా దీదీ కేబినెట్‌లో మార్పులు చేర్పలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version