Site icon Prime9

Mechanic Rocky: మెకానిక్‌ రాకీ 2.0 ట్రైలర్‌ చూశారా? – యాక్షన్‌, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ట్రైలర్‌

Mechanic Rocky 2.0 Trailer Out: ‘మాస్‌ కా దాస్‌’ విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Movie). కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం. మెకానిక్‌ రాకీ 2.0 అంటూ ట్రైలర్‌ వదిలి మూవీపై మరింత బజ్‌ పెంచింది చిత్ర బృందం.

ఇటీవల విడుదలైన ఫస్ట్‌ ట్రైలర్‌ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగింది. లవ్‌, రొమాన్స్‌తో కామెడీ ఎలిమెంట్స్‌ని జత చేసి మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించే విధంగా మొదటి ట్రైలర్‌ కట్‌ చేశారు. ఇక తాజాగా రిలీజైన 2.0 ట్రైలర్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌గా సాగింది. ముఖ్యంగా ఫాదర్‌ సెంటిమెంట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది మూవీ టీం. యాక్షన్‌ సీన్స్‌లో ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌ని నెక్ట్స్‌లెవల్‌కు తీసుకువెళ్లిందని చెప్పోచ్చు. కాగా ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ని అందిస్తున్నారు.

Exit mobile version