Site icon Prime9

Kushi Movie : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ “ఖుషి” టీం..

vijay devarakonda kushi movie trailer release date announced

vijay devarakonda kushi movie trailer release date announced

Kushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మళ్ళీ లవ్ ట్రాక్ లోకి వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే.

మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సమంత అనారోగ్యానికి గురి కావడంతో సినిమా (Kushi Movie) షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సామ్ కోలుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇటీవలే గుమ్మడి కాయ కొట్టేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ‘ఖుషి’ట్రైలర్ ఆగస్ట్ 9న విడుదల కానుందని మూవీ టీమ్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకండ్లు ఉంటుందని కూడా రివీల్ చేశారు.

 

 

అయితే ట్రైలర్ గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం కోసం విజయ్, సమంత కలిసున్న ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సాంగ్స్‌ను లూప్‌లో వింటున్నారు. దీంతో మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి విజయ్ – సామ్ జోడీ ఈ సినిమాతో ఏ మ్యాజిక్ చేస్తారో అని.

కాగా టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ పై క్రష్ ఉందని.. తనతో నటించాలని ఉందంటూ మనసులోని మాటల్ని బయటపెట్టారు.

Exit mobile version