Victory Venkatesh: ఎప్పుడూ కూల్ గా, చాలా ప్రశాంతంగా , అందరితో ప్రెండ్లీ గా ఉంటాడు విక్టరీ వెంకటేష్ . ప్రస్తుతం వెంకటేష్, రానా మెయిన్ రోల్స్ లో కలిసి ఓ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరిస్ ప్రసారం కానుంది. అయితే తాజాగా వెంకటేష్.. నెట్ ఫ్లిక్స్ పై సీరియస్ అయ్యాడు.
నెట్ ఫ్లిక్స్ పై ఫైర్(Victory Venkatesh)
రానా నాయుడు వెబ్ సిరీస్ కు ఎవరి పేరునో ఎలా పెడుతారంటూ ఫైర్ అయ్యాడు. వెంకీ గన్ను పట్టుకుని వార్నింగ్ ఇస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందకీ వెంకీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడనుకుంటున్నారా? రానా, వెంకటేష్ కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’.
అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనవన్’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సిరీస్ త్వరలో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా వెంకీ, రానా అభిమానులను అలరించింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ ప్రారంభించింది.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా రానాకు, నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు వెంకటేష్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023
మజాక్ మజాక్ మే.. : వెంకటేష్
‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందంగా కనిపించేది ఎవరు? నేను. స్టార్ ఎవరు? అది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నా వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ షో పేరు కూడా నాదే కావాలి.
రానా నాయుడు కాదు ‘నాగా నాయుడు’ అని టైటిల్ పెట్టండి. నాతో మజాక్‌లొద్దు.. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది అని నెట్‌ఫ్లిక్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఈ వీడియో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోలో వెంకటేష్ లుక్ బాగుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ఈ వీడియోకు నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం అంటూ రానాని ట్యాగ్ చేసింది.