Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి తమన్ సంగీత అందించారు.
థియేటర్ లో బాలయ్య సందడి..
ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ చూడాలని నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షక్షులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఈ చిత్రం ప్రివ్యూస్ ను ఏర్పాటు చేశారు. అదే విధంగా హైదరాబాద్ లో తెల్లవారుజామునే ‘వీరసింహారెడ్డి’షో మొదలైంది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో వేసిన ఈ స్పెషల్ షోలో నందమూరి బాలకృష్ణ( Bala Krishna) సందడి చేశారు. దర్శకుడు గోపీచంద్ తో కలిసి థియేటర్ కు వచ్చిన బాలయ్య అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. మాస్ ఎంట్రీతో వచ్చిన బాలయ్యకు నందమూరి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.
అభిమానుల సంబరాలు
హైదరాబాద్ లోని భ్రమరాంబ అంటే బాలయ్య కు బాగా సెంటిమెంట్. ఆయన సినిమాలు ఏది రిలీజ్ అయినా ఇక్కడే ఫస్ట్ షో చూడటం అలవాటు. అందులో భాగంగా వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఆయన భ్రమరాంబకు వచ్చారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. మాస్ ఎంట్రీతో వచ్చిన బాలయ్యకు నందమూరి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. డాన్సులు, క్రాకర్స్, డ్రమ్స్ తో అభిమానులు చేసిన సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. చిత్ర యూనిట్ తో అభిమానుల మధ్య కూర్చుని బాలయ్య సినిమా చూశారు. మరోవైపు వీరసింహారెడ్డి సినిమా అడ్వాన్స్ బుక్సింగ్ తో దూసుకెళ్లింది. బాలయ్య సినిమా ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో ఫ్యాన్స్ పుల్ ఖుషీగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వీరసింహారెడ్డి బాగా ట్రెండ్ అవుతోంది. రిలీజ్ కు ముందు రోజు నుంచే బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…
నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లుపై చిరంజీవి ఏమన్నారంటే?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/