Upasana : మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే తాజాగా ముంబైలో ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చరణ్ తో లవ్ స్టోరీ గురించి, పెళ్లి తర్వాత జరిగిన కొన్ని విషయాల గురించి ఓపెన్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇంతకీ ఉపాసన ఆమె ఏమన్నారంటే (Upasana)..
‘‘చిన్నప్పటి నుంచి నా విషయంలో ఎవరో ఒకరు జడ్జ్ చేసేవారని ఉపాసన తెలిపారు. అలాగే తన శరీరాకృతి, బ్యాగ్రౌండ్ విషయాల్లో విమర్శలను ఫేస్ చేశానని.. తనలానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో విమర్శలను ఫేస్ చేసే ఉంటారని చెప్పుకొచ్చారు. విమర్శలను మనం ఎలా తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమని.. విమర్శలు వచ్చినప్పుడు తానేం డీలా పడిపోలేదని వివరించారు. పెళ్లి అయిన కొత్తల్లో నేను లావుగా ఉన్నానని, అందంగా లేనని, డబ్బులు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వారిని నేనేమీ అనదలుచుకోవటం లేదు. ఎందుంటే వారికి మా గురించి ఏమీ తెలియదు. క్రమంగా ఈ పదేళ్ల కాలంలో నేనేంటో వారికి తెలిసింది. ఇప్పుడు నాపై వారి అభిప్రాయం మారింది. ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు తెలుసు. అందుకనే ఇప్పుడు నన్ను నేనొక చాంఫియన్‌లా అనుకుంటాను. విమర్శలను ఎదుర్కోవటం వల్ల నేను ఇంకా ధైర్యవంతురాలిగా మారాను అన్నారు.
అదే విధంగా చరణ్ తో పెళ్లి గురించి చెబుతూ..
నాకు, రామ్ చరణ్‌కి మధ్య కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంటాం.. వ్యక్తిగా తను ఏదో విషయంలో ఎప్పుడూ నాకు ఛాలెంజ్ విసిరేవాడు. అలానే నేను కూడా అంతే తనకు ఛాలెంజ్‌లను విసిరేదాన్ని. అలా మా మధ్య ప్రేమ పుట్టింది. అప్పుడు చరణ్ నాతో ఒక మాట చెప్పాడు. ఏంటంటే.. ప్రేమలో పడటం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావు అని చరణ్ నాతో అన్నాడు. తను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరివీ భిన్నమైన నేపథ్యాలున్న కుటుంబాలు అయితే మా అంటీ, సోదరి మా పెళ్లి విషయంలో కీలక పాత్రను పోషించారని తెలిపారు.