Site icon Prime9

Upasana : రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం స్పెషల్ గిఫ్ట్.. ఇంతకీ ఎవరు ఇచ్చారంటే ?

upasana post about special gift for thier baby

upasana post about special gift for thier baby

Upasana : తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక యితేవాల చాలా కాలం తర్వాత ఉపాసన గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి లో ఉన్నారు. మెగా వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ మరియు మెగా అభిమానుల్లో పండుగా వాతావరణం నెలకుంది. ఇక ఈ శుభవార్త విన్న కొందరు సెలబ్రిటీస్ ఉపాసనకు బహుమతులు పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళు రామ్ చరణ్ – ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు.

ప్రజ్వల ఫౌండేషన్ తరుపున చెర్రీ – ఉపాసన దంపతులకు పుట్టబోయే బిడ్డకు వారు శశవంతంగా తయారు చేసిన ఒక ఉయ్యాలను బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమనులతో పంచుకుంది ఉపాసన. ఆ పోస్ట్ లో .. మీరు పంపిన ఈ అపూర్వ కానుక నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ ఉయ్యాలా  ధైర్యం, బలం, ఆత్మగౌరం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుందని.. ఈ కానుకను అందుకున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ఉపాసన. వారందరికీ థాంక్స్ చెబుతూ ఒక వీడియోని షేర్ చేసింది. సెక్స్ ట్రాఫికింగ్‌లో ఇరుక్కొని బయటపడిన మహిళలకు ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది.

ఉపాసన ఇటీవల ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇక తమకి పుట్టబోయే బిడ్డని చిరంజీవి దగ్గరే పెంచనున్నట్లు చెప్పుకొచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత అత్తమామల (చిరంజీవి-సురేఖ) దగ్గరకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. కూడా కొన్నిరోజులు క్రితం ఉపాసనకు ఒక బహుమతి పంపించింది.

Exit mobile version