Union Minister Kishanreddy: అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘ఓకల్ ఫర్ లోకల్’ పేరుతో తలపెట్టిన ప్రధానమంత్రి విధానాన్ని పాటించారు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన హైదరాబాదులోని ఖాదీ బండార్ దుకాణాన్ని సందర్శించారు. ఖద్దరు దుస్తులను కొనుగోలు చేసారు. కార్డు రూపంలో నగదు చెల్లించి డిజిటల్ ఇండియాకు బాసటగా నిలిచారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నాటి ఉద్యమంలో ఖద్దరు దుస్తుల పాత్ర ఎంతో కీలకంగా పేర్కొన్నారు. గాంధీజీ నడిచిన మార్గంలో మనమూ సాగాలంటే స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ సాధించాలనుకొన్న 5ట్రిలియన్ డాలర్ల డిజిటల్ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకు కార్డు ద్వారా నగదు చెల్లించిన్నట్లు ఆయన పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఓకల్ ఫర్ లోకల్ పేరుతో భాజపా స్ధానిక ఉత్పత్తులను ప్రజలు కొనుగోళ్లు చేసేలా కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. మరోవైపు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి అనే నినాదంతో భాజపా ముందుకుపోతుంది. దేశంలోని ధనం బయటకు పోకుండా దేశాభివృద్ధికి ఉపయోగపడడం, రైతులు, కూలీల జీవితాలు అభివృద్ది బాటలో సాగడం, స్వయం ఉపాధి మార్గాలతోనే భారత దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ప్రధాన ఉద్ధేశం.
ఇది కూడా చదవండి:Ambati Rambabu: అభివృద్ది పై చర్చకు సిద్దమా? హరీష్ రావుకు అంబటి రాంబాబు సవాల్