Site icon Prime9

TS LAWCET 2022: నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు రిలీజ్

TS-PECET-2022 results Out

TS-PECET-2022 results Out

Hyderabad: నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. వెంకట రమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ. రవీందర్, ప్రొ.లింబాద్రి విడుదల చేయనున్నారు. రిజల్ట్స్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ ఏడాది జరిగిన లాసెట్‌ పరీక్షలకు మొత్తం 35 వేల 538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28 వేల 921 మంది జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Exit mobile version