Ts Cabinet Meeting: రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆధ్యక్షతన..ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. శాసన సభలో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సారి సుమారు.. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. కేబినేట్ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ నాందేడ్ వెళ్లారు.
బడ్జెట్ సమావేశాలు ఎప్పటివరకంటే?
ఈ సారి బడ్జెట్ సమావేశాలు.. కొద్ది రోజులే ఉంటాయని తెలుస్తుంది. ఈ సమావేశాలు ఈ నెల 12న ముగించాలని తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది.
రేపు ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరు రోజుల్లోనే ఈ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బడ్జెట్ సమావేశాలను ఇంత త్వరగా ముగించండపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కనీసం నెల రోజులైన బడ్జెట్ సమావేశాలు జరిగేలా చూడాలని.. ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ఇంత త్వరగా ఎందుకు ముగిస్తున్నారు..
జాతీయ రాజకీయాల్లో విస్తరించడానికి.. కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించిన ఆ పార్టీ.. మహారాష్ట్రంలో మరో సభను నిర్వహిస్తుంది.
దీని తర్వాత.. ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో సభలు నిర్వహించనుంది బీఆర్ఎస్. దీంతో సమయం ఎక్కువగా కేసీఆర్ వాటికే కేటాయిస్తున్నారు.
అందుకే ఈ సమావేశాలను తక్కువ రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పలు రాష్ట్రాల నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
మరో వైపు రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు 18 జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం జరిగింది.
మరో ఎనిమిది సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సమావేశాలను త్వరగా ముగించాలని భారాస భావిస్తోంది. విపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నాయి.
నాందేడ్‌లో నేడు బహిరంగ సభ
దేశ రాజకీయాల్లో ముద్ర వేయాలనే లక్ష్యంతో భారాస ముందుకు పోతోంది. అందుకే తగినట్లుగానే పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది.
తెలంగాణలో కాకుండా.. బయట ప్రాంతంలో మెుదటి సారిగా సభ నిర్వహిస్తుంది. నాందేడ్ లో జరిగే ఈ సభకు.. కేసీఆర్ హాజరుకానున్నారు.
ఈ సభలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని వివరించనున్నారు. ఈ సభలో మహారాష్ట్రకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు.
మరాఠకు చెందిన నాయకులే లక్ష్యంగా.. బీఆర్ఎస్ చర్చలు జరిపింది. తెలుగు ప్రజలు.. మైనార్టీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో విస్తృతంగా సమావేశాలు జరిపారు
సభ జరిగే ప్రాంతంలో.. కేసీఆర్ చిత్రాలతో భారీ కటౌట్లను ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు.
గురుద్వారాను సందర్శించిన అనంతరం.. మధ్యాహ్నం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/