Hyderabad: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో మైలురాయిని సాధించారు. సామాన్య టీచర్‌గా జీవితాన్ని మొదలు పెట్టి తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రసమయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో తనకంటూ గుర్తింపు పొందారు.
రసమయి తెలంగాణ ఉద్యమం ధూం ధాం పై పీహెచ్‌డీలో బంగారు పతకం పొందారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వేడుకల్లో భాగంగా, తెలుగు యూనివర్సిటీ ఛాన్సిలర్, రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా డాక్టరేట్‌తో పాటు బంగారు పథకాన్ని అందుకున్నాడు. బాబా సాహెబ్ స్ఫూర్తితో పీహెచ్‌డీ చేశానని.. తనకు డాక్టరేట్‌తో పాటు బంగారు పతకం రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రసమయి తెలిపారు.