Bharat Jodo Yatra: పంజాబ్‌లో శనివారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జలంధర్ కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి (76)గుండెపోటుతో మరణించారు.
పంజాబ్‌లోని ఫిలింనగర్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో సంతోఖ్ సింగ్ చౌదరి కుప్పకూలారు.
వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మరణించారు. రాహుల్ గాంధీ వెంటనే యాత్రను నిలిపివేసి ఆసుపత్రికి చేరుకున్నారు.
ఇలా ఉండగా చౌదరి మరణం పార్టీకి తీరనిలోటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
మా ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి అకాల మరణం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.
ఆయన మరణం పార్టీకి మరియు సంస్థకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఖర్గే ట్వీట్ చేశారు.
ఎంపీ మృతి పట్ల సంతోక్ సింగ్ చౌదరి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం వ్యక్తం చేశారు.
సంతోక్ సింగ్ చౌదరి 2014లో మరియు తరువాత 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు.
ఆయన కుమారుడు విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి పంజాబ్‌లోని ఫిల్లౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
నవంబర్ నెలలో మహారాష్ట్రలో భారత్ జోడోయాత్ర సాగుతుండగా కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణకుమార్ పాండే కుప్పకూలారు.
వెంటనే ఆసుపత్రికి తరలించినా ఆయన ప్రాణాలు దక్కలేదు.
ఒకరోజు విరామం తర్వాత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ఉదయం లూథియానాలోని లాధోవల్ టోల్ ప్లాజా నుంచి భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)ను తిరగి ప్రారంభించారు.
యాత్రలో పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రెనేడ్ దాడులు చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర పోలీసులు శుక్రవారం ఫీల్డ్ ఆఫీసర్లకు హెచ్చరిక జారీ చేశారు.
జనవరి 11న, పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) కార్యాలయం ద్వారా ఈ మేరకు ఒక లేఖను టాప్ ఫీల్డ్ ఆఫీసర్లకు పంపినట్లు తెలిసింది.
‘హత్ సే హత్ జోడో యాత్ర’కు సంబంధించిన తదుపరి కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి కాంగ్రెస్ నిర్వహించనుంది.
ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చార్జిషీట్‌తో పాటు రాహుల్ రాసిన లేఖను పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రజలకు పంచనున్నారు.
జోడోయాత్ర చివరి దశకు చేరుకోవడంతో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖ్రాగే 21 భావసారూప్య రాజకీయ పార్టీల అధినేతలకు లేఖ రాశారు.
జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ జాబితాలో ఆమ్‌ను చేర్చలేదని వర్గాలు తెలిపాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/